బిర్యానీ తింటూ కూల్‌డ్రింక్ తాగితే ఆ మజానే వేరు కదూ. తాగేటప్పుడు బాగున్నా తర్వాత జరిగే పరిణామాలు అనారోగ్యానికి దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీతో డ్రింక్ తీసుకుంటే కడుపులో ఆమ్లత్వం పెరిగి గుండెలో మంటగా ఉంటుంది. షుగర్ ఉన్నవారికి మరింత ప్రమాదకరం. కూల్ డ్రింక్స్‌లో అధికంగా ఉండే చక్కెరలు, కేలరీలు శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమై గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్‌తో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. బిర్యానీలో ఉన్న ప్రోటీన్లు, కొవ్వులు శరీరానికి అధిక శక్తిని ఇస్తాయి. కూల్ డ్రింకులతో పాటు తీసుకోవడం వలన శరీరంలో టాక్సిన్ లు ఎక్కువ అవుతాయి, ఇది కాలేయంతో పాటు కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది.
కూల్ డ్రింకులు ఎక్కువగా తాగడం వలన మధుమేహ మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్షణమే పెరిగి, తరువాత త్వరగా తగ్గిపోతాయి. ఇది శరీరంలో ఉత్సాహాన్ని తగ్గిస్తుంది, చలాకీగా ఉండే శక్తిని కోల్పోవటానికి కారణం అవుతుంది. బిర్యానీ లాంటి రుచికరమైన ఆహారం తిన్నప్పుడు తక్షణమే కూల్ డ్రింకులు తాగడం వలన, ఈ ఫలితాలు స్పష్టంగా కనపడతాయి.
బిర్యానీతో పాటు కూల్ డ్రింకు తీసుకోవడం మూత్రపిండాల పై విషపదార్థాల పేరుకుపోవడానికి కారణం అవుతుంది. కూల్ డ్రింకులు కిడ్నీల ద్వారా డిటాక్సిఫికేషన్ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. దీని వలన, దీర్ఘకాలంలో కిడ్నీ సంబంధిత సమస్యలు రావచ్చు.