AA22

AA22: తారక్ సినిమాను తలపించేలా ‘AA22’?

AA22: అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ బాంబ్! ‘AA22’ సినిమాపై ఇండస్ట్రీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ చిత్రంలో బన్నీ ట్రిపుల్ రోల్‌లో మెరవనున్నాడని టాక్. ఒకటి మాఫియా గ్యాంగ్‌స్టర్, మరొకటి యోధుడు, ఇంకొకటి సీజీఐ క్యారెక్టర్‌గా కనిపించనున్నాడట. బ్రదర్స్ సెంటిమెంట్‌తో జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ తరహాలో కథ నడుస్తుందని అభిమానుల ఊహాగానాలు. మూడు వైవిధ్యమైన హెయిర్‌స్టైల్స్, స్లాంగ్‌లు, కాస్ట్యూమ్స్‌తో బన్నీ అదరగొట్టనున్నాడు.

Also Read: Kamal Haasan: న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌పై క‌ర్ణాట‌క హైకోర్టు సీరియ‌స్‌

AA22: దర్శకుడు అట్లీ ఈ సినిమాను ఫ్రాంచైజీగా మార్చాలని ప్లాన్ చేస్తున్నాడట. బన్నీ గ్యాంగ్‌స్టర్ రోల్ ‘ది గాడ్‌ఫాదర్’ మైఖేల్ కొర్లియోన్‌ను తలపించనుందని హాట్ టాపిక్. జూన్ 2025లో షూటింగ్ షురూ కానుంది. భారతీయ సంస్కృతితో కూడిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంతర్జాతీయ స్థాయిలో విజువల్ వండర్‌గా నిలవనుంది. అట్లీతో కలిసి పనిచేయడం ఎంజాయ్ చేస్తున్నానని బన్నీ చెప్పాడు. ఫిజికల్, మెంటల్ ట్రైనింగ్‌లో మునిగిన బన్నీ ఈ సినిమాతో ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jai Hanuman: జై హనుమాన్ ఇక లేనట్టేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *