IPS Officer Sanjay: ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సంజయ్, ఈరోజు విజయవాడలోని ఏసీబీ కోర్టులో సరెండర్ అయ్యారు. కోర్టు ఆయనకు వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించడంతో, అతడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
ఫైర్ డిపార్ట్‌మెంట్‌లోని ‘ఎన్‌ఓసీ’ (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని సంజయ్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. అయితే, పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు సంజయ్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంజయ్ ఈరోజు కోర్టులో లొంగిపోయారు.
Also Read: AP News: ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు.. వచ్చే ఏడాదికి అందుబాటులోకి 4 పోర్టులు
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంజయ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు మరింత వేగంగా విచారణ జరిపే అవకాశం ఉంది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అవినీతి ఆరోపణల నేపథ్యంలో రిమాండ్‌కు వెళ్లడం పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.