IPL 2026, SRH vs CSK

IPL 2026, SRH vs CSK: ఉప్పల్‌లో రైజర్స్ హవా.. చెన్నైపై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం!

IPL 2026, SRH vs CSK: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై పైన హైదరాబాద్ భారీ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.

అభిషేక్, క్లాసెన్ మెరుపులు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ (59) ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (59) లు చెరో అర్ధశతకంతో పటిష్టమైన స్కోరును అందించారు. వీరిద్దరి బాదుడుతో స్టేడియం హోరెత్తిపోయింది.

తడబడిన చెన్నై టాప్ ఆర్డర్

195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కేకు ఆశించిన ఆరంభం లభించలేదు.

  • సంజు సామ్సన్ ఫెయిల్యూర్: గత మ్యాచ్‌ల హీరో సంజు సామ్సన్ (7) నితీష్ రెడ్డి బౌలింగ్‌లో తక్కువ పరుగులకే అవుట్ కావడంతో చెన్నై కష్టాల్లో పడింది.

  • యువ రక్తం ఆయుష్: యువ ఆటగాడు ఆయుష్ మహాత్రే (13 బంతుల్లో 30) వేగంగా ఆడి గైక్వాడ్‌తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించినా, నితీష్ రెడ్డి అతడిని పెవిలియన్‌కు పంపాడు.

  • కెప్టెన్ నిష్క్రమణ: గైక్వాడ్ కూడా ఇషాన్ మలింగ ధాటికి నిలవలేకపోయాడు.

మధ్యలో పోరాడినా ఫలితం దక్కలేదు

మాథ్యూ షార్ట్ (34), సర్ఫరాజ్ ఖాన్ (25) జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా మలింగ వీరి జోడీని విడగొట్టాడు. విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ డకౌట్ కావడం సీఎస్‌కే ఆశలపై నీళ్లు చల్లింది. చివర్లో శివమ్ దూబే (21), అన్షుల్ కంబోజ్ పోరాడినప్పటికీ హైదరాబాద్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు చెన్నై తలవంచక తప్పలేదు.

బౌలింగ్ హీరో: ఇషాన్ మలింగ

హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో చెన్నై నడ్డి విరిచాడు.

  • ఇషాన్ మలింగ: 29/3

  • నితీష్ కుమార్ రెడ్డి: 31/2

  • షకీబ్ హుస్సేన్: 32/1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *