Jukal

Jukal: రోడ్డున పడ్డ జుక్కల్‌ కాంగ్రెస్ రాజకీయం

Jukal: జూకల్ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి..జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జూకల్‌ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు కోసం సీనియర్లు ఆరాటపడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు పార్టీ సీనియర్లకు మధ్య మధ్య పచ్చ గడ్డి వేసినా బగ్గుమంటోంది. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడి పనిచేసిన వారిని నిర్లక్ష్యం చేసి కొత్తగా చేరిన వారికి పదవులు ఇస్తున్నారంటూ జూకల్‌ కాంగ్రెస్‌ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. జూకల్ కాంగ్రెస్‌ వివాదం గాంధీభవన్ మెట్ల మీద ఆందోళన చేసే వరకు వెళ్లింది. పీసీసీ అధ్యక్షుడే స్వయంగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌ నాయకులు చల్లబడ్డారు. కాంగ్రెస్‌ గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతుండడంతో శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.

Jukal: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఇంటర్వ్యూ నిర్వహించడం కాంగ్రెస్ సీనియర్ల నేతలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడ్డ వారి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడం ఏంటని బహిరంగంగానే నేతలు విమర్శించుకుంటున్నారు.. నామినేటెడ్ పదవుల విషయంలో ఎమ్మెల్యేల మాటే చెల్లుబాటవుతుండడంతో మరో వర్గం నిరాశకు లోనవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు ఉత్సాహం చూపుతుండడంతో టికెట్ల కేటాయింపు సమయంలో విభేదాలు మరింత రచ్చకెక్కుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Tandur: ఆ సామాజికవర్గానికి దగ్గరయ్యరేలా బీఆర్‌ఎస్‌ ప్టాన్‌..మొన్న ఓడించింది వాళ్లేనా…?

Jukal: జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ క్యాడర్‌ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ తర్వాత కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారు. కానీ కాంగ్రెస్‌ నాయకుల మధ్య విభేదాల కారణంగా కార్యకర్తలు బీజేపీ, బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ కార్యకర్తల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చందంగా తయారైంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని అధిష్ఠానం ఎంతో కృషిచేస్తున్నా స్థానికంగా ఉన్న నాయకుల మధ్య వర్గపోరు సమస్యను గుర్తించి తగ్గిస్తేనే కాంగ్రెస్‌కి భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం వ్యవహారంలో హై కమాండ్ ఏం చేస్తుంది. రాష్ట్ర నాయకత్వం ఎలాంటి పరిష్కారం చూపబోతుంది అనేది చూడాలి మరి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *