Bhadradri kothagudem: పండుగపూట తేగడ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే..చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు.
ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల జాడ అంత వెతికినా కనిపించక పోయే సరికి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.