Indiramma Indlu: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకమైన ఇందిరమ్మ ఇండ్ల పథకం శుక్రవారం (ఫిబ్రవరి 21) నాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ఇదేరోజు శంకుస్థాపన చేయన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Indiramma Indlu: నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎంపిక చేసిన ఇతర చోట్ల కూడా ఆయన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఇతర జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ పథకాన్ని కేవలం ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ను మినహాయించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Indiramma Indlu: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు (ఫిబ్రవరి 21న) వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లికి చేరుకుంటారు. అక్కడ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఏటా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠంగా ఏటా 4,50,000 ఇళ్లను ఇవ్వాలని భావించింది. ఈ మేరకు ఇప్పటికి ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. తొలి విడతలో ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసిన మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.