IndiGo

IndiGo: ఇండిగోలో గందరగోళం.. ప్రయాణికులకు రీఫండ్‌పై కీలక ప్రకటన

IndiGo: దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగో సేవల్లో ఇటీవల తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం వలన వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులలో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామం విమానాశ్రయాల్లో పెద్ద గందరగోళానికి దారితీసింది.

ఈ నేపథ్యంలో, ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్తూ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. వారు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా, క్షమించండి… మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం” అని ప్రయాణికులను ఉద్దేశించి పేర్కొన్నారు. డిసెంబర్ 5 నుంచి 15వ తేదీ మధ్య ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఒక శుభవార్త చెప్పారు. ఈ అంతరాయాల కారణంగా ఎవరైనా తమ టికెట్లను రద్దు చేసుకున్నా లేదా రీషెడ్యూల్ చేసుకున్నా వారికి పూర్తి డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు.

పరిస్థితి మాకు అర్థమైంది… సహకరిస్తాం
ఇండిగో తమ ప్రకటనలో, గత కొన్ని రోజులుగా పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నాయో మేము పూర్తిగా అర్థం చేసుకోగలం. ఈ సమస్య రాత్రికి రాత్రే పరిష్కారం కాకపోయినా, మీకు సహకరించడానికి మరియు కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మేము ప్రతి ప్రయత్నం చేస్తున్నాం అని పేర్కొన్నారు. గత 19 ఏళ్లుగా ప్రయాణికులు తమపై ఉంచిన నమ్మకాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తున్నామని సంస్థ స్పష్టం చేసింది.

అయితే, ముఖ్యంగా దేశీయ సర్వీసులకే ఈ అంతరాయాలు, ఆలస్యాలు ఎక్కువగా ఉండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రద్దులన్నీ అనుకోకుండా జరిగినవి కావు, ఇదంతా వ్యూహాత్మకంగా చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, అంతర్జాతీయ సర్వీసుల్లో పది శాతం రద్దు కూడా లేదు. ఆ మార్గాల్లో ఆదాయం ఎక్కువ ఉంటుంది, వాటిని రద్దు చేస్తే కఠినమైన ప్రయాణికుల నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కొందరు ప్రయాణికులు తీవ్రంగా విమర్శించారు. ఈ సంక్షోభం ఇండిగో విశ్వసనీయతపై ప్రభావం చూపుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *