Indian Origin Woman: కెనడాలోని కాల్గరీ (Calgary) నగరంలో భారత సంతతికి చెందిన ఓ మహిళ నడిరోడ్డుపై చేసిన రచ్చ చివరకు ఆమె అరెస్టుకు దారితీసింది. పాదచారుడితో ట్రాఫిక్ వివాదంలో తలపడి, దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతడి బ్యాగ్‌ను లాగుతూ దాడికి దిగిన దృశ్యాలు కెమెరాలో రికార్డై నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. “పోలీసులకు చెబితే నాకు భయమేమీ లేదు” అంటూ సవాలు విసిరిన సదరు మహిళను.. ఘటనా స్థలానికి చేరుకున్న కాల్గరీ పోలీసులు నేరుగా అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు.
అసలేం జరిగింది? – వివాదానికి కారణం..
రోడ్డు దాటుతున్న ఒక పాదచారుడికి (Pedestrian) సదరు మహిళ ప్రయాణిస్తున్న కారు దారి ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం పెడెస్ట్రియన్కు మార్గం ఇవ్వకపోవడంతో, ఆ వ్యక్తి తన మొబైల్ ఫోన్ తీసి కారును, అక్కడి పరిస్థితిని వీడియో తీయడం మొదలుపెట్టాడు.
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..
కెనడాలో భారత సంతతి మహిళ అరెస్ట్
కాల్గరీలో రోడ్డు దాటుతున్న వ్యక్తికి దారి ఇవ్వకుండా, తిరిగి అతడిపై వాగ్వాదానికి దిగిన భారత సంతతి మహిళ
కారు దారి ఇవ్వలేదని వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తితో వాగ్వాదానికి దిగి, అతని ఫోన్ లాక్కునేందుకు యత్నించి, బ్యాగ్ పట్టుకొని రోడ్డుపై లాగిన మహిళ
దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిందని సమాచారం అందుకొని మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2026
