శతక్కొట్టిన స్మృతి మంధాన‌.. వన్డే సిరీస్ భారత్ కైవసం

IND W vs NZ W ODI Series: న్యూజిలాండ్ జట్టుతో జరగుతున్న వన్డే సరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలవడంతో చివరి మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది.

బ్రూక్‌ హల్లిడే (86; 96 బంతుల్లో 9×4, 3×6), ప్లిమ్మర్‌(39), వికెట్ కీప‌ర్ ఇస‌బెల్లా గేజ్(25), లీ తహుహు(24)లు ఫర్వాలేదనిపించారు. మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా ప్రియా మిశ్రా 2, రేణుక సింగ్‌, సైమా ఠాకూర్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం దీంతో 232 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్ స్మృతి మంధాన‌(100, 122 బంతుల్లో 10×4) సెంచ‌రీతో చెల‌రేగింది. మ‌రో ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ(12), రోడ్రిగ్స్‌ (22)లు నిరాశ‌ప‌రిచినా.. య‌స్తికా భాటియా(35), కెప్టెన్ హ‌ర్మన్‌ప్రీత్ కౌర్(59 నాటౌట్)లు రాణించారు. దీంతో కేవలం 44.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ 236 పరుగులు చేసింది.దీంతో భారత మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో రోవ్‌ 2 వికెట్లు పడగొట్టగా, సూఫీ డివైన్‌, జోనస్‌ తలో వికెట్‌ తీశారు. కాగా, మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2–1తేడాతో కైవసం చేసుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *