India Women

India Women: ఐదేళ్ల తర్వాత సిరీస్‌ను సాధించిన టీమిండియా

India Women: ఐదేళ్ల తర్వాత సిరీస్‌ను సాధించిన టీమిండియా నవీ ముంబైలో డిసెంబర్ 19, 2024న జరిగిన సిరీస్‌లోని మూడవ T20I మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు 60 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టును ఓడించింది. ఈ విజయం ఐదేళ్ల తర్వాత స్వదేశంలో భారత్‌కు తొలి టీ20 సిరీస్‌ను అందించింది. అంతకు ముందు 2019లో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచింది. మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాల తరువాత వెస్ట్ ఇండీస్ లాంటి దిగ్గజ జట్టుతో సిరీస్ 2-1 తేడాతో గెలుపొందింది.

ఇది కూడా చదవండి: Janaki vs State Of Kerala: సురేష్ గోపి.. అనుపమల కోర్ట్ డ్రామా జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ

India Women: స్మృతి మంధాన, రిచా ఘోష్ వంటి కీలక ఆటగాళ్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ ఇన్నింగ్స్ స్మృతి మంధాన 77 పరుగులు, రిచా ఘోష్ 54 పరుగులతో రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 217/4 భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ జట్టు మొదటి నుంచే పేలవంగా ఆడింది. మొత్తమ్మీద 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 మాత్రమే చేయగలిగింది. స్మృతి మందాన 77 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది.

India Women: అలాగే సిరీస్ అంతటా అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికైంది. రాబోయే T20 ప్రపంచకప్‌లో సత్తా చాటాలని చూస్తున్న భారత మహిళల జట్టుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుంది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kothapallilo Okappudu: ఆసక్తిరేపుతోన్న కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *