India VS Pakisthan:భారత మెస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుంచి పారిపోయినట్టు సమాచారం. అతనితోపాటు చోటా షకీల్, మున్నా జింగాలు సైతం వేరే దేశానికి పారిపోయినట్టు వార్తలు అందుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్‌లోకి భారత్ డ్రోన్లు, క్షిపణులు దూసుకెళ్లాయి.
India VS Pakisthan:9 చోట్ల ఉగ్రవాద స్థావరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాక్ దుశ్చర్యలతో గురువారం రాత్రి పాక్‌లోని ఇస్లామాబాద్ సహా 11 కీలక నగరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడులతో ఆ దేశ ప్రధానే పారిపోయి ఓ బంకర్‌లో తలదాచుకున్నట్టు వార్తలొచ్చాయి.
India VS Pakisthan:ఒకవేళ మరింతగా భారత్ దాడులు చేస్తే ఎలాగైనా తాము భారత్ చేతికి చిక్కిపోతామేమోనని భయం వారిలో పట్టుకున్నది. ఈ దశలో భారత్ లక్ష్యంగా ఉంటామేమోనన్న భయంతో దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, మన్నా జింగాలు వేరే దేశాలకు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.
