Team India

Team India: మన స్పిన్ బలం ఏమైపోయింది? టీమిండియా ఎందుకిలా?

Team India: టీమిండియాటీమిండియాలో ద్రవిడ్, సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ఉన్న సమయంలో గింగరాలు తిప్పే పిచ్ అయినా పరుగులు సాధించారు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వెటోరి వంటి  ప్రపంచ మేటి స్పిన్నర్లకు ఎదురొడ్డి అవలీలగా పరుగుల వరద పారించారు. అప్పట్లో స్పిన్‌ టీమ్‌ఇండియా బలం. స్వదేశంలో స్పిన్‌ పిచ్‌లపై ప్రత్యర్థి జట్లను చిత్తుచేయడం టీమిండియాకు అలవాటు. ప్రత్యర్శి స్పిన్నర్లను ఎదుర్కొని భారీగా పరుగులు చేయడం.. మన స్పిన్నర్లు వికెట్ల వేట సాగించి ప్రత్యర్థిని కుప్పకూల్చడం ఆనవాయితీ. వీరి శకం ముగిసింది. స్పిన్ ను సమర్థంగా ఎదుర్కోవడం గతంగా మారింది. 

 కొన్నేళ్లుగా స్పిన్‌ పిచ్‌లపై టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ప్రదర్శన పడిపోయింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన 3 మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో  స్పిన్‌ కు అనుకూలించే  పిచ్‌లపై చివరి రెండు టెస్టుల్లో భారత్‌ చేసిన పరుగులు  వరుసగా 156, 245, 263, 121. ఈ సిరీస్‌లో స్పిన్‌ బౌలింగ్‌లో భారత్‌ కేవలం 24.4 సగటుతో 37 వికెట్లు కోల్పోయింది.  స్పిన్‌ బౌలింగ్‌లో 30 కంటే ఎక్కువ సగటు నమోదు చేసిన వారిలో 66 సగటుతో  పంత్‌, 44.5 సగటుతో  వాషింగ్టన్‌ సుందర్ ఉన్నారు. పరుగులు సాధించిన వారిలో ఓపెనర్  యశస్వి జైస్వాల్‌ 25.6, శుభ్‌మన్‌ 29.5,  సర్ఫరాజ్‌ ఖాన్‌ 23.5 సగటు నమోదు చేసినా..  స్పిన్‌ ఆడటంలో తడబడ్డారు.  16.75 సగటుతో కోహ్లి, 10.5 సగటుతో  రోహిత్‌ దారుణమైన ప్రదర్శనతో విలన్లుగా నిలిచారు.  సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్‌ లాంటి మేటి ఆటగాళ్లతో కూడిన జట్టు స్పిన్‌ను సమర్థంగా ఆడేది. 2000 నుంచి 2020 వరకు స్వదేశంలో టెస్టుల్లో భారత టాప్‌-7 ఆటగాళ్ల ఉమ్మడి సగటు 47.12గా ఉంటే.. 2020 తర్వాత అది 36కు పడిపోయింది. 

Team India: స్టార్ క్రికెటర్లు దేశవాళీ టోర్నీలు ఆడకపోవడమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్పిన్‌ను ఆడటంలో మన బ్యాటర్ల ప్రమాణాలు రోజురోజుకూ క్షీణిస్తుండటానికి ఇదే ప్రధాన కారణమంటున్నారు మాజీలు. గతంలో  అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వారం విరామం దొరికినా సచిన్, గంగూలీ, జహీర్, సెహ్వాగ్, ద్రవిడ్, లక్ష్మణ్‌ తదితరులు రంజీ మ్యాచ్‌లాడేవాళ్లు. కానీ ఇప్పుడు అవకాశమున్నా మన స్టార్ క్రికెటర్లు ఆడట్లేదు.  కెప్టెన్ రోహిత్‌ చివరగా 2015లో, కోహ్లి 2013లో రంజీల్లో ఆడారు. వీళ్లు దేశవాళీల్లో ఆడలేకపోవడానికి తీరిక లేని షెడ్యూల్‌ కారణమవొచ్చు. కానీ పని భారం కోసం విశ్రాంతి తీసుకునే ఆటగాళ్లు.. ఛాన్స్‌ ఉన్నప్పుడు ఎందుకు వదిలేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.  

 ఈ ఏడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లకు మధ్య 42 రోజుల విరామం దొరికింది. ఈ మధ్యలో ఆరంభమైన దులీప్‌ ట్రోఫీలో ఆడాలని రోహిత్, కోహ్లి, అశ్విన్‌ను ప్రధాన సెలక్టర్‌ అగార్కర్‌ అడిగితే.. ఆడాలన్న ఉత్సాహం లేదని చెప్పారనే వార్తలొస్తున్నాయి. బుమ్రా, జడేజా కూడా దూరంగా ఉన్నారు. ఇలా చేస్తే ఇక స్పిన్‌ బౌలింగ్‌లో ఎక్కువగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఎక్కడిది? కివీస్‌తో సిరీస్‌లో పంత్, జైస్వాల్, గిల్‌ మినహా మిగతా ఆటగాళ్లకు తమ డిఫెన్స్‌ టెక్నిక్‌ మీద నమ్మకం ఉన్నట్లే కనిపించలేదు. స్పిన్నర్లను ఆడటంలో ఆత్మవిశ్వాసం, షాట్లపై నియంత్రణ లోపించింది. స్పిన్‌ను ఎదుర్కోవడానికి స్వీప్‌ ప్రధాన ఆయుధమే కానీ ఆటకు ముందు రోజు ఉదయం ఈ షాట్లను ప్రాక్టీస్‌ చేసి మైదానంలో దిగితే ఫలితం ఉండదు. ముందు నుంచే పట్టు సాధించాలి. కానీ మన బ్యాటర్లకు అది పట్టదు. సాధన కోసం దేశవాళీ మ్యాచ్‌లను ఉపయోగించుకుందామనే ఆలోచన కనిపించడం లేదు. 

ALSO READ  Nayanthara: ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’లో నయన్ ప్రేమాయణాలు ఉంటాయా..?

Team India: టీ20 మాయలో పడిన మన బ్యాటర్లు టెస్టు క్రికెట్ ఆడడంలో తడబడుతున్నారు.  ఐపీఎల్‌లో అభిమానుల వినోదం కోసం భారీగా పరుగులు చేసేలా బ్యాటింగ్‌కు సహకరించే పిచ్‌లే రూపొందిస్తున్నారు. . టీ20ల మోజులో పడి టెస్టు క్రికెట్‌కు అవసరమైన నైపుణ్యాలను మన బ్యాటర్లు అందిపుచ్చుకోవడం లేదు. ఐపీఎల్‌లో అదరగొడితే చాలు కెరీర్‌ కుదురుకుంటుందని అనుకుంటున్నారు. పేరు, డబ్బు రావడంతో పాటు టీమ్‌ఇండియా టీ20 జట్టులో చోటూ దక్కుతుంది. అక్కడ రాణిస్తే వన్డే, ఆపై టెస్టు జట్టులోకి వచ్చేయొచ్చు. అందుకే దేశవాళీ కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పుడు టీమ్‌ఇండియాకు ఆడుతున్న చాలా మంది ఐపీఎల్‌తో వచ్చినవాళ్లే.  ఇలా  భారీ షాట్లతో బ్యాటర్లు చెలరేగిపోతే.. 24 బంతులేసి స్పిన్నర్లు చేతులు దులిపేసుకుంటున్నారు. టెస్టుల్లో బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నంలో తరుచుగా అనవసర షాట్లు కొట్టి ఔటవడం  చూస్తుంటాం. వారికి అలాగే ఆడటం వచ్చు. టీ20ల్లో బ్యాటింగ్‌ వికెట్‌పై భారీ షాట్లు అలాగే కొడతారు. అలాంటిది ఒక్కసారిగా స్పిన్‌ పిచ్‌పై గింగిరాలు తిరిగే బంతులను ఆడాలంటే ఎలా? అందుకే ముప్పుతిప్పలు పడుతున్నారని విశ్లేషకులు మొత్తుకుంటున్నారు.

 కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా.. పేస్‌ పిచ్‌లపై విఫలమవుతున్నామనే స్పిన్‌ పిచ్‌లు రూపొందిస్తే.. వీటిపైనా ఓటమి పాలైతే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఆడేందుకు వెళ్లే భారత్‌కు పేస్, స్వింగ్, బౌన్సీ పిచ్‌లు స్వాగతం పలుకుతాయి. అలాంటిది మనం సొంతగడ్డపై స్పిన్‌ పిచ్‌లు రూపొందించుకోవడంలో తప్పులేదు. ప్రత్యర్థి బ్యాటర్లకు ఇక్కడి పరిస్థితులపై పెద్దగా అవగాహన ఉండదు, స్పిన్‌ ప్రాక్టీస్‌ ఎక్కువగా ఉండదు కాబట్టి ఉచ్చు బిగించేస్తాం. కానీ ఇప్పుడు అది మన మెడకే చుట్టుకుంటోంది. గతేడాది ఇండోర్ లో ఆసీస్‌ చేతిలో, ఈ ఏడాది హైదరాబాద్‌లో ఇంగ్లండ్  చేతిలో ఓటమితో ప్రమాద ఘంటికలు మోగినా టీమిండియా మేనేజ్ మెంట్, బిసిసిఐ  పట్టించుకోలేదు. 

Team India: స్పిన్‌ను ఆడటంలో మన బ్యాటర్ల వైఫల్యం ఒకెత్తయితే.. ప్రత్యర్థి జట్లు ఉత్తమ ప్రదర్శనతో అదరగొట్టడం మరొక ఎత్తు. ఉమ్మడిగా 213 వికెట్ల అనుభవం ఉన్న అయిదుగురు స్పిన్నర్లతో న్యూజిలాండ్‌ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అశ్విన్‌ ఒక్కడే 500 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అయినా ప్రత్యర్థి జట్టులోని ఎజాజ్, శాంట్నర్, ఫిలిప్స్‌ భారత్‌ను దెబ్బకొట్టారు. ఇక తొలి రెండు టెస్టుల్లో అశ్విన్‌ 10 వికెట్లు తీస్తే.. జడేజా 6 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. టెస్టు అవసరాలకు తగ్గట్లుగా కొత్త స్పిన్నర్లు రావడం లేదు. దీంతో స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయలేక.. అవతలి స్పిన్నర్లను ఆడలేక టీమ్‌ఇండియా ఓటమిపాలవుతోంది. 

ALSO READ  Intermediate Exams: ఈరోజు నుంచే ఇంటర్మీడియేట్ పరీక్షలు.. సీసీ కెమెరాల పర్యవేక్షణ!

లో అపార అనుభవం ఉన్నా.. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌ లాంటి నిన్నటి తరం ఆటగాళ్లతో ఆడిన రోహిత్, కోహ్లి ప్రదర్శన నానాటికీ పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యంగ్ ప్లేయర్లకు మార్గదర్శకంగా నిలవాల్సిన వీరిద్దరు స్పిన్‌ ఆడటంలో తేలిపోయి ఓటమికి ప్రధాన కారణంగా మారుతున్నారు. యువ ఆటగాళ్లకు పరిస్థితులపై అవగాహన లేదు కాబట్టి విఫలమవుతున్నారనుకోవచ్చు. మరి 2013 నుంచి 2019 వరకు స్వదేశంలో కోహ్లి సగటు 72.45గా ఉంటే.. 2020 తర్వాత అది 32.86కు పడిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో అది 28.29కు చేరుకుంది. ఈ ఏడాది సొంతగడ్డపై స్పిన్‌ బౌలింగ్‌లో అతని సగటు 23.33. 2019 వరకు ఎడమ చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో కోహ్లి సగటు 123.80. కానీ ఆ తర్వాత అది 23.08కు చేరింది. ఈ ఏడాది స్వదేశంలో 10 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి 21.33 సగటుతో 192 పరుగులే చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 15.50 సగటుతో 93 పరుగులే సాధించాడు. ఏడేళ్లలో ఇదే అత్యల్పం. 

Team India: ఇక రోహిత్‌ ఏమో టెస్టుల్లోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడినట్లే దూకుడుతో వికెట్‌ పారేసుకుంటున్నాడు. చాలా ఇన్నింగ్స్‌ల్లో స్పిన్నర్లు బంతి అందుకునే లోపే అతను పెవిలియన్‌ చేరిపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో అయిదు సార్లు పేసర్లకే వికెట్‌ పారేసుకున్నాడు. స్వదేశంలో గత అయిదు టెస్టులు చూస్తే స్పిన్నర్ల బౌలింగ్‌లో రోహిత్‌ సగటు 8.25 మాత్రమే. ఈ ఏడాది స్వదేశంలో టెస్టుల్లో రోహిత్‌ 19 ఇన్నింగ్స్‌ల్లో 28.05 సగటుతో 533 పరుగులు చేశాడు. ఓ ఏడాదిలో ఇదే అత్యల్ప సగటు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *