India- America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్తవ్యస్థ నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నది. అమెరికాకు సొంత కూటమి అనుకున్న యూరఫ్ దేశాలు కూడా ఆయనపై ఒకింత నిరసన స్వరాలను వినిపిస్తున్నారు. కొన్ని దేశాలు బయటకు చెప్పుకోలేకపోయినా, లోలోపల మాత్రం వ్యతిరేకతతోనే ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైఖరిపై స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఒకానొక దశలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు సైతం జరగడం గమానర్హం.
India- America: ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక, జనాభా కలిగిన దేశమైన భారత్‌పై అమెరికా ఆంక్షల పర్వం కొనసాగిస్తున్నది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌పై అమెరికా గుర్రుగా ఉన్నది. రష్యా నుంచి భారతదేశం చమురు ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. భారత్ స్పందించకపోవడంతో అనుకున్నట్టుగానే తొలుత భారత్ వస్తువులపై 25 శాతం సుంకాలను విధించింది.
India- America: ఆనక మళ్లీ మరో 25 శాతం అంటే మొత్తంగా 50 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించి తీవ్రస్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికాలోని ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఆర్థిక నిరక్షరాస్యుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇతర దేశాల ప్రయోజనాల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని మండిపడ్డారు.
India- America: డొనాల్డ్ ట్రంప్‌ను అస్సలు నమ్మవద్దని భారతదేశానికి ఆర్థిక వేత్త జెఫ్రీ సాచ్స్ సూచించారు. ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. భారతదేశం అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదగడాన్ని డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇలా పలువురు అమెరికా ప్రముఖులు ట్రంప్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శులు గుప్పిస్తూనే ఉన్నారు. అయినా ట్రంప్‌లో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.
