హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య మాట మాట పెరగడంతో హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరి గుట్టలో మద్యం తాగుతున్న స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగింది. ఇది కాస్త తీవ్రంగా మారడంతో హత్యకు దారితీసింది. అర్దరాత్రి మద్యం తాగుతున్న స్నేహితులు కొట్టుకొని.. నదీమ్ అనే యువకుడిని హత్య చేశారు.
స్థానికులు ఘటనపై సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని రికవరీ చేశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఇదిలా ఉంటే.. జగద్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు నెలల్లో మూడు హత్యలు జరిగితాయి.