CISF

CISF: సీఐఎస్‌ఎఫ్ లో తొలి మహిళా బెటాలియన్

CISF: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో తొలి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మొదటి ఆల్ ఉమెన్ బెటాలియన్ 1,000 మంది సిబ్బందితో ఏర్పాటు చేస్తారు. 

దేశంలోని కీలకమైన విమానాశ్రయాలు, మెట్రో రైళ్లు వంటి మౌలిక సదుపాయాలను పరిరక్షించడంతోపాటు కమాండోలుగా వీఐపీలకు భద్రత కల్పించే బాధ్యతను త్వరలో ఏర్పాటు చేయనున్న సీఐఎస్‌ఎఫ్‌కి చెందిన ఆల్‌ ఉమెన్‌ బెటాలియన్‌ వహిస్తుంది. 

ఇది కూడా చదవండి: RIL- Viacom18: ఒకటైన డిస్నీ స్టార్ ఇండియా – రిలయన్స్ వయాకామ్-18

CISF: దేశ నిర్మాణంలో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్న నరేంద్ర మోదీ ఆలోచనలకూ అనుగుణంగా  సీఐఎస్‌ఎఫ్‌లో మొదటి ఆల్‌ ఉమెన్ బెటాలియన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మొత్తం మహిళలతో కూడిన ఈ బెటాలియన్ విమానాశ్రయాలు, మెట్రో రైళ్లు వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడానికి, కమాండోలుగా VIP భద్రతను అందించడానికి బాధ్యత వహిస్తుంది. దేశాన్ని రక్షించే కీలకమైన కర్తవ్యంలో పాలుపంచుకోవాలనుకునే మరింత మంది మహిళల ఆకాంక్షలను ఈ నిర్ణయం కచ్చితంగా నెరవేరుస్తుందని అమిత్ షా అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యపు పొగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *