Hyderabad: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్ నెక్లెస్ రోడ్డు సందడికి వేదిక కానున్నది. పలు రకాల స్టాళ్లు ఇప్పటికే వెలిశాయి. సంగీత విభావరులు అలరించనున్నాయి. పలువురు సినీ గాయకులతో పాటు సినిమా హీరోయిన్లు మెరవనున్నారు.
Hyderabad: ప్రజా విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్డు, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ప్రముఖ సినీ తారలు సందర్శించి సందడి చేస్తారు. ఈ వేడుకల్లో లక్కీభాస్కర్ సినిమాతోపాటు పలు హిట్ సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి, మరో హీరోయిన్ అంజలితో పాటు పలువురు నటీనటులు ఆరు గంటలకు అలరించనున్నారు. హ్యాండీక్రాప్ట్స్, ఫుడ్ స్టాళ్లను వారంతా సందర్శిస్తారు.
Hyderabad: ఆ తర్వాత ఐమాక్స్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు సినీ తారలంతా హాజరవుతారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సినీతారలు తమ ఆటపాటలతో అలరించనున్నారు. సందడి చేయనున్నారు.