Murder Mystery

Murder Mystery: ఒంటరితనమే ప్రాణం తీసిందా? పిల్లలను కూడా ఎందుకు తీసుకువెళ్లింది?

Murder Mystery: శనివారం రోజు తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కానీ తనతో పాటు పిల్లలను కూడా ఎందుకు తీసుకువెళ్లిందో అనేదే అందరి ప్రశ్న. భర్త గత 4 ఏళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ వీరికి దూరంగా ఉంటున్నాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒంటరితనమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి, లాప్‌టాప్ ఇంకా మొబైల్‌నుస్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపేందుకు సిద్ధమయ్యారు. కేసులో భాగంగా పలువురిని విచారించగా, ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆమె పడ్డ మనోవేదన బయటపడింది.

మొదటి నుండి చూస్తే..

2007లో సురేందర్ రెడ్డి, విజయారెడ్డికి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య ప్రేమతో వచ్చే చిన్న చిన్న గొడవలు సహజమే. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. ఒకరు ఇంటర్ సెకండ్ ఇయర్, మరొకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. నాలుగేళ్ల క్రితం సురేందర్ రెడ్డికి దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయారు. విజయారెడ్డి మాత్రం పిల్లలను చదివిస్తూ ఇక్కడే ఉండేవారు. ఆమె ఓ ఐటీ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నారు. నైట్ షిఫ్ట్‌ల కారణంగా పిల్లల చదువుకు ఇబ్బంది కలగకూడదని వారిని హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్ట్: 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

అవసరాలకు మించిన డబ్బు ఉన్నా.. పక్కన భర్త, పిల్లలు లేకపోవడం ఆమెను కుంగదీసింది. (నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తే పిల్లలు కాలేజీలో ఉండటం, వాళ్లు ఇంటికి వస్తే ఆమె డ్యూటీలో ఉండటం వల్ల ఒంటరితనం పెరిగింది). భరించినన్ని రోజులు భరించింది కానీ, చివరికి కాలానికి లొంగిపోయింది. ఒంటరితనాన్ని తట్టుకోలేక, మరణానికి 15 రోజుల ముందు నుండే బంధువులకు, స్నేహితులకు తన బాధను తెలిపింది. అప్పుడు విన్నప్పుడు అందరికీ అది సామాన్యంగానే అనిపించింది కానీ, ఒంటరితనం ఇంత కఠినమైన నిర్ణయానికి దారితీస్తుందని ఎవరూ అనుకోలేదు. ముగ్గురి శరీరాలకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దుబాయ్ నుండి సురేందర్ రెడ్డి వచ్చాక ఆదివారం భువనగిరి జిల్లా బీబీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

మరణానికి ముందు..

విజయారెడ్డి తన సొంత కారులో శుక్రవారం పిల్లలు ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి ఇద్దరినీ బయటకు తీసుకువచ్చారు. తర్వాత కారులో వస్తున్న సమయంలో పిల్లలిద్దరితో మాట్లాడారు (ఈ సమయంలోనే పిల్లలను కూడా తనతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తెలుస్తోంది). చివరికి చర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్‌కు వచ్చి ఆగారు. అక్కడ తీసుకున్న పార్కింగ్ టికెట్ వెనుక సూసైడ్ నోట్ రాసి, దానిని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టారు. తర్వాత కారు బ్యాక్ సీట్లో పెట్టారు. అందులో.. “నాకు బ్రతకాలని లేదు.. నేను చనిపోతే పిల్లలు ఇద్దరూ ఒంటరి అవుతారు” అని రాసి ఉంది.

చివరి మెసేజ్ వాళ్లకే..

విజయారెడ్డి మొబైల్, లాప్‌టాప్ పరిశీలిస్తున్న పోలీసులకు కొన్ని విషయాలు తెలిశాయి. 15 మంది ఉన్న టీమ్‌కు ఆమె లీడర్. అందులో ఉన్న ఇద్దరితో చివరగా మాట్లాడినట్లు, మెసేజ్ చేసినట్లు తెలిసింది. ఆదివారం జీఆర్పీ కార్యాలయానికి ఆ ఇద్దరినీ పిలిపించి విచారించారు. విజయారెడ్డి తమకు ప్రాజెక్టులు అప్పగిస్తారని, అందులో ఏవైనా తప్పులు లేదా మార్పులు ఉన్నప్పుడు ప్రతిసారి మాట్లాడలేం కాబట్టి మెసేజ్ చేస్తామని వారు చెప్పుకొచ్చారు. కుటుంబంలో విభేదాలు, ఆస్తి తగాదాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

నిపుణుల హెచ్చరిక:

ఒంటరిగా ఉండటం కొంతకాలం బాగానే ఉంటుంది కానీ, కాలం గడిచే కొద్దీ భయం వేస్తుంది. మాట్లాడటానికి ఎవరూ లేకపోవడం, ఉద్యోగంలో ఎంతమంది ఉన్నా ఇంటికి వచ్చాక తోడు లేకపోవడం పెద్ద సమస్య. నిద్ర సరిగ్గా లేకపోవడంతో బయట వ్యక్తులకు కనిపించకపోయినా లోలోపల డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి ఆలోచనల వల్లే ఇలాంటి మరణాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా అనిపించినప్పుడు స్నేహితులతో మాట్లాడటం లేదా బయటకు వెళ్లి సమయం గడపడం, జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఉండటం వల్ల ఒంటరితనం కొంత తగ్గుతుందని వారు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *