Hyderabad: మెట్రో చార్జీలపై దిగొచ్చిన ఎల్‌అండ్‌టీ 

HYDERABAD: పెరిగిన మెట్రో ఛార్జీలపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎల్‌అండ్‌టీ మెట్రో దిగొచ్చింది. ప్రయాణికుల ఆందోళనల నేపథ్యంలో తాజా భారాలను కొంతవరకు తగ్గిస్తూ, పెంచిన టికెట్ ధరలపై 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ రాయితీలు ఈ నెల 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది.

పెరిగిన టికెట్ ధరలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెరగ్గా, కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు చేరింది. ఈ పెంపు పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎల్‌అండ్‌టీ ఈ సవరణకు మొగ్గు చూపిది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *