Hyderabad: హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు భారీ శబ్దాలు విని భయభ్రాంతులకు గురయ్యారు. క్షణాల్లోనే మంటలు విస్తరించడంతో పరిసర ప్రాంతాలను పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకుంది. భారీగా వ్యాపించిన మంటలను అదుపు చేసేందుకు నాలుగు ఫైరింజన్లు మోహరించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమించాయి.
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. కొన్ని వ్యాపార సముదాయాలు, గోదాములు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.
