HYDERABAD: హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భార్య భర్తను హత్య చేసిన సంఘటన కలకలం రేపుతుంది. బాచుపల్లికి చెందిన అంజిలప్ప అనే వ్యక్తి, మద్యం మత్తులో ఉండగా అతని భార్య రాధ గొంతు నులిమి చంపింది. అనంతరం ఇది ఆత్మహత్యగా అనిపించేలా సీన్స్ సృష్టించింది. భర్త మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌కి తరలించి అంత్యక్రియలు చేయాలని ఏర్పాట్లు చేసింది.
అయితే, అంజిలప్ప గొంతుపై అనుమానాస్పద మరకలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో విచారణకు లోనైన రాధ చివరకు నిజాన్ని ఒప్పుకుంది తానే భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో రాధను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు, ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనతో బాచుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.