Hyderabad: హైదరాబాద్ నగరంలో మరోసారి సైబర్ మోసగాళ్ల దందా బయటపడింది. వాట్సాప్ కాల్ ద్వారా 81 ఏళ్ల వృద్ధుడిని హానీ ట్రాప్‌లోకి దింపి భారీ మొత్తాన్ని ఎగరేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అమీర్‌పేట్‌కు చెందిన ఆ వృద్ధుడిని జూన్ మొదటి వారం నుండి మాయ రాజ్‌పుత్ అనే మహిళ పేరుతో స్కామర్లు సంప్రదించారు. మొదట చనువుగా మాట్లాడుతూ, తరచూ వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లతో వృద్ధుడి విశ్వాసం పొందారు. ఆ తరువాత భావోద్వేగాలపై ఆడుతూ అతడిని ఉచ్చులోకి దించారు.
తరువాత ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ మొత్తం రూ. 7.11 లక్షలు వసూలు చేశారు. ఈ మోసపూరిత వ్యవహారం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
👉 సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు:
అనుమానాస్పద నంబర్ల నుండి వచ్చే కాల్స్/మెసేజ్‌లకు స్పందించకండి.
వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు.
ఎలాంటి మోసపూరిత ప్రలోభాలు ఎదురైనా వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.