Hyderabad: గ్రూప్ వన్ రిజల్ట్స్ రిలీజ్.. ఇక్కడ చెక్ చేసుకోండి..

Hyderabad: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి కీలక ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 563 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించగా, చివరకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు.

రేపు గ్రూప్-2 ఫలితాలు

గ్రూప్-1 ఫలితాల తర్వాత గ్రూప్-2 ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు TSPSC ప్రకటించింది. పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహించగా, దానికి సంబంధించిన వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు

ఈ నెల 20లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు

TSPSC ప్రకటన ప్రకారం, ఈ నెల 20లోపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ మార్కులను TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

ఫలితాల కోసం వెబ్‌సైట్ చూడాలి

తమ రిజల్ట్స్ తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్‌ (www.tspsc.gov.in) ద్వారా తన ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షల ఫలితాల విడుదలతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు ఎంతో ఊరటనిచ్చే అవకాశం వచ్చింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *