Hyderabad

Hyderabad: అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణం తీశాడు….

Hyderabad: ఓ వ్యాపారి హత్య పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది..ఎందుకంటే ఆ వ్యాపారి ఎవరూ హత్య చేసి ఉంటారు.. ఎందుకు చేశారో తెలియదు.. ఇంట్లో ఆచూకీల కోసం ముమ్మరంగా వెతికిన ఏమీ దొరకలేదు.. తన ఫోన్‌ ను పరిశీలించగా..ఎలాంటి ఆధారాలు దొరకలేదు.. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఏమీ దొరకలేదు..కానీ, మన పోలీసులు కేసు ను వదిలేయ్యారు కదా.. చిన్న క్లూ దొరకడంతో.. దాని ఆధారంగా పోలీసులు తీగలాగా.. అసలు విషయం బయటకు వచ్చింది.. అప్పు ఇచ్చిన పాపానికి హత్య చేశాడు ఆ దుర్మార్గుడు.. చివరకు ఆ నిందితుడిని ఎలా పట్టుకున్నారు..

హైదరాబాద్ ముషీరాబాద్ లో దారుణం జరిగింది. అప్పు ఇచ్చిన పాపానికి వ్యాపారిని హత్య చేశారు. తిరిగి ఇవ్వమని అడిగినందుకు చంపి నీటి సంపులో పడేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: Crime News: మూడేళ్ల కూతురుకు ఉరేసి చంపింది.. అదే ఉరికి త‌ల్లీ బ‌లి

ఏప్రిల్ 4న ఫైనాన్షియర్ సట్నం సింగ్ డబ్బులు వసూలు చేసేందుకు అల్వాల్ నుంచి ముషీరాబాద్ బోయి గూడ వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సట్నం సింగ్ ను చంపి సంపులో పడేసినట్లు గుర్తించారు.

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు నవీన్ ను వైజాగ్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సట్నం సింగ్ దగ్గర అప్పు చేసిన నవీన్.. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగే సమయంలో ఇద్దరు గొడవపడ్డరు. దీంతో సట్నం సింగ్ ను కత్తితో పొడిచి సంపూలో పడేసి వైజాగ్ పారిపోయాడు నిందితుడు నవీన్. సట్నం సింగ్ మృతదేహంపై పలు కత్తిపోట్లు ఉన్నాయి. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసేందుకు యత్నించాడు నవీన్ అని పోలీసులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  April Fools Day: ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎందుకు జరుగుపుకుంటారు ? కారణం తెలిస్తే.. షాక్ అవడ్ పక్కా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *