Hyderabad: భారీ ఆపరేషన్.. 16 కోట్ల స్వాధీనం

Hyderabad: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) భారీ ఆపరేషన్ నిర్వహించి కేరళ, బెంగళూరు ప్రాంతాల్లో ఆరుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. వీరు కలిసి సుమారు రూ.16.20 కోట్ల విలువైన సైబర్ మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులను బెదిరించడం, మోసం చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును అక్రమంగా వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

ఈ నిందితులు ప్రధానంగా “డిజిటల్ అరెస్ట్” పేరిట బెదిరింపులు, నకిలీ ట్రేడింగ్ అవకాశాలు, కొరియర్ పార్సిళ్ల పేరుతో మోసాలు వంటి పద్ధతులను ఉపయోగించారు. పోలీస్ లేదా ఇతర అధికారులుగా నటిస్తూ బాధితులను భయపెట్టి డబ్బులు వసూలు చేయడం, అలాగే నకిలీ పెట్టుబడి పథకాలతో ప్రజలను ఆకర్షించడం వంటి మార్గాల్లో మోసాలకు పాల్పడ్డారు.

అలాగే మ్యూల్ అకౌంట్లను ఉపయోగించి అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సైబర్ నేరగాళ్లు ఇంకా పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *