AP News

Human Trafficking: వైజాగ్‌లో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టు రట్టు..

Human Trafficking: అంతా సైలెన్స్ . ఎవరి పనుల్లో వారు ఉన్నారు. అక్కడే కొందరు అమ్మాయిలు . అక్కడ ఉన్న వారు ఇక్కడి వారు కాదు అని వారిని చూస్తేనే అర్తం అవుతుంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు. అందులోను ఇక్కడే ఎందుకు ఉన్నారు. ఎక్కడో తేడా కొడుతోంది . అందుకే అక్కడికి వేలి ..మీరు ఎక్కడి వారు అని ఆరా తీశారు. అప్పుడు తెలిసింది ..ఎక్కడో ఉండాల్సిన వారు ఇక్కడ ఉన్నారు..అని. మొత్తం ఆరాతీస్తే ఇదిగో ఈ భయంకర నిజం బయటపడింది.

ఎన్నికల సమయంలో ఏపీలో సంచలనం రేపిన అంశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటి. రాష్ట్రం నుంచి దాదాపు 30 వేల మంది అమ్మాయిలు, మహిళలు వైసీపీ ఐదేళ్ల పాలనలో అదృశ్యం అయ్యారని ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేంద్రం నుంచి తనకు సమాచారం ఉందని, లెక్కలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు తెలిసిందే. తాజాగా విశాఖపట్నంలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టు రట్టయ్యింది.

Human Trafficking: కిరండోల్‌- విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 11 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో రైల్వే పోలీసులు ఒక్కసారిగా ఆకస్మిక దాడి చేశారు. తమిళనాడుకు బాలికల్ని అక్రమ రవాణా చేస్తున్న రవి బిసోయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కిడ్నాప్ అయి రవాణా అవుతున్న ఆ చిన్నారులు ఒరిస్సాలోని నవరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. విశాఖ రైల్వే పోలీసులు బాలికల్ని ఒడిషా పోలీసులకు అప్పగించనున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు హ్యుమన్ ట్రాఫికింగ్ కేసును ఒడిషా పోలీసులకు అప్పగించారు.

Human Trafficking: ఆ గ్యాంగ్‌లో ఇంకా ఎంత మంది ఉన్నారు, బాలికల్ని రవాణా చేయడం ఇదే తొలిసారా, గతంలో ఇలాంటివి ఎక్కడ చేశారు అనే కోణాల్లో ఒడిషా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Akhil-Zainab Wedding: అఖిల్ అక్కినేని మరియు జైనాబ్ రౌజీ వివాహం; అందమైన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *