Spirit: ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబో స్పిరిట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో హుమా ఖురేషి స్పెషల్ సాంగ్‌తో పాటు చిన్న పాత్రలో కనిపించనుంది. వచ్చే షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరగనుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. త్రుప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తాజాగా బాలీవుడ్ నటి హుమా ఖురేషిని స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేశారని సమాచారం.
Also Read: Sharwanand: శర్వానంద్ – శ్రీను వైట్ల సినిమాలో మ్యాడ్ బ్యూటీ?
అంతేగాక ఆమె ఇందులో చిన్న పాత్రలోనూ కనిపించనుంది. వచ్చే షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో సందీప్ రెడ్డి వంగా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేశారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా మార్క్ కథతో ఈ సినిమా వినూత్న చిత్రంగా తెరకెక్కుతుంది.
