Huma Qureshi: బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ తమిళ్, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. ఆసిఫ్ తనకు కజిన్ అవుతాడు. అయితే, గురువారం రాత్రి 9:30, 10 గంటల మధ్య.. ఢిల్లీలోని నిజాముద్దీన్ ఏరియాలోని, జంగ్పురా భోగల్ లేన్ లో ఉన్న ఆసిఫ్ ఇంటి ముందు ఎదురింటి వ్యక్తి స్కూటీ పార్క్ చేశాడు. ఆసిఫ్, టూవీలర్ ను గేటుకి అడ్డు తియ్యమని చెప్పడంతో.. ఆ వ్యక్తి, ఆసిఫ్ ని దుర్భషలాడుతూ.. స్కూటీని తీసుకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత అతని సోదరుడితో కలిసి వచ్చి.. మళ్లీ తిడుతూ.. ఇద్దరూ కలిసి పదునైన ఆయుధాలతో ఆసిఫ్ పై దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆసిఫ్ ను చుట్టు పక్కల వారు హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్స్. స్కూటీ తియ్యమని చెప్పినందుకు అకారణంగా తన భర్తను పొట్టన పెట్టుకున్నారంటూ ఆసిఫ్ భార్య కన్నీరు మున్నీరవుతోంది. కాగా నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
