Visakhapatnam

Visakhapatnam: విశాఖలో రామమందిరం పేరుతో భారీ దోపిడీ!

Visakhapatnam: భక్తి ముసుగులో ఫక్తు వ్యాపారానికి తెరతీశారు. అయోధ్య రామాలయాన్నే దానికోసం ఎంచుకున్నారు. ఆ రామాలయం సెట్‌ వేసి భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు. అయోధ్యకు వెళ్లి రాముడిని ఎప్పుడు చూస్తామో, ఇక్కడ దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది కదా! అనుకునే భక్తులే టార్గెట్‌గా విశాఖపట్నంలో పెద్దఎత్తున దోపిడీ చేస్తోంది ఓ బృందం. బీచ్‌ రోడ్డులో పార్క్‌ హోటల్‌ పక్కనే ఖాళీ స్థలంలో మే నెలాఖరులో అయోధ్య రామాలయం సెట్‌ వేశారు. రెండు నెలలే ఉంటుందని ప్రకటించారు. భక్తులు భారీగా వస్తున్నారు. నమూనా ఆలయంలోకి వెళ్లాలంటే రూ. 50 టికెట్‌ తీసుకోవాల్సిందే. చెప్పులు పెట్టుకోవడానికి ఇంకో రూ. 5 చెల్లించాలి. లోపలికి వెళ్లాక రాముడిని కళ్లారా చూసి నమస్కారం చేసుకునేలోపే అక్కడ ఉండే సిబ్బంది బయటకు లాగేస్తున్నారు. పగటి పూట జనాలు లేకపోయినా సరే పెద్దపెద్దగా కేకలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. భక్తులు ఎక్కువగా వచ్చే సాయంత్రం వేళ బౌన్సర్లను పెడుతున్నారు.

బీచ్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ జామ్‌
శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. కార్లు, ద్విచక్ర వాహనాలను బీచ్‌ రోడ్డులో పార్కు చేస్తున్నారు. వందలాది వాహనాలతో పార్కింగ్‌ ప్రదేశాలన్నీ నిండిపోయి సాధారణ ప్రజలు నడిచి వెళ్లడానికి కూడా రోడ్డుపై ఖాళీ ఉండడం లేదు. ఆ రెండు రోజుల్లో పార్క్‌ హోటల్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించడం పోలీసులకు సాధ్యపడడం లేదు. అయితే బీజేపీ పేరు చెప్పి నిర్వాహకులు పోలీస్‌ అధికారులను అటువైపు రానీయడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ యూత్‌ కమిటీలో రాష్ట్ర స్థాయి నేత దందాలో కీలకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. విశేష ఉత్సవాల తేదీలను ప్రకటించిన టీటిడీ

భక్తి ముసుగులో ఫక్తు వ్యాపారానికి తెరతీశారు. అయోధ్య రామాలయాన్నే దానికోసం ఎంచుకున్నారు. ఆ రామాలయం సెట్‌ వేసి భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు. అయోధ్యకు వెళ్లి రాముడిని ఎప్పుడు చూస్తామో, ఇక్కడ దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది కదా! అనుకునే భక్తులే టార్గెట్‌గా విశాఖపట్నంలో పెద్దఎత్తున దోపిడీ చేస్తోంది ఓ బృందం. బీచ్‌ రోడ్డులో పార్క్‌ హోటల్‌ పక్కనే ఖాళీ స్థలంలో మే నెలాఖరులో అయోధ్య రామాలయం సెట్‌ వేశారు. రెండు నెలలే ఉంటుందని ప్రకటించారు. భక్తులు భారీగా వస్తున్నారు. నమూనా ఆలయంలోకి వెళ్లాలంటే రూ. 50 టికెట్‌ తీసుకోవాల్సిందే. చెప్పులు పెట్టుకోవడానికి ఇంకో రూ. 5 చెల్లించాలి. లోపలికి వెళ్లాక రాముడిని కళ్లారా చూసి నమస్కారం చేసుకునేలోపే అక్కడ ఉండే సిబ్బంది బయటకు లాగేస్తున్నారు. పగటి పూట జనాలు లేకపోయినా సరే పెద్దపెద్దగా కేకలు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. భక్తులు ఎక్కువగా వచ్చే సాయంత్రం వేళ బౌన్సర్లను పెడుతున్నారు.

బీచ్‌ రోడ్‌లో ట్రాఫిక్‌ జామ్‌
శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. కార్లు, ద్విచక్ర వాహనాలను బీచ్‌ రోడ్డులో పార్కు చేస్తున్నారు. వందలాది వాహనాలతో పార్కింగ్‌ ప్రదేశాలన్నీ నిండిపోయి సాధారణ ప్రజలు నడిచి వెళ్లడానికి కూడా రోడ్డుపై ఖాళీ ఉండడం లేదు. ఆ రెండు రోజుల్లో పార్క్‌ హోటల్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించడం పోలీసులకు సాధ్యపడడం లేదు. అయితే బీజేపీ పేరు చెప్పి నిర్వాహకులు పోలీస్‌ అధికారులను అటువైపు రానీయడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ యూత్‌ కమిటీలో రాష్ట్ర స్థాయి నేత దందాలో కీలకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *