Horoscope Today: ఫిబ్రవరి 2, 2026, సోమవారం నాటి ద్వాదశ రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకోండి.
మేషం (Aries): వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
వృషభం (Taurus): ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా పురోగతి లభిస్తుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్తగా పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం (Gemini): ఈ రాశి వారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి అద్భుతమైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.
కర్కాటకం (Cancer): అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అదనపు ఆదాయం లభిస్తుంది కానీ, స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్త. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.
సింహం (Leo): పనుల్లో కొంచెం శ్రమ ఎక్కువైనా ఫలితం మాత్రం అనుకూలంగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి వార్తలు వింటారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Pakistan: టి20 మ్యాచ్లు భారత్ తో ఆడం
కన్య (Virgo): అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.
తుల (Libra): ఈ రాశి వారికి సమయం చాలా బాగుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
వృశ్చికం (Scorpio): సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి తగాదాలు క్రమంగా సర్దుమణుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
ధనుస్సు (Sagittarius): కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి.
మకరం (Capricorn): రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.
కుంభం (Aquarius): పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో పూర్తి చేస్తారు. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
మీనం (Pisces): ఉద్యోగంలో మీపై అధికారుల నమ్మకం పెరుగుతుంది. సామాజిక మర్యాదలు దక్కుతాయి. జీవిత భాగస్వామి నుంచి శుభవార్త అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
