Horoscope Today

Horoscope Today: శనివారం 12 రాశుల వారి జాతకం ఎలా ఉందంటే..

Horoscope Today: ఈ రోజు శనివారం. గ్రహచార రీత్యా ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరికి శుభవార్తలు అందుతాయి? వృత్తి, ఉద్యోగాల్లో ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అనే పూర్తి వివరాలు మీకోసం..

మేషం
వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆఫీసులో మీ సలహాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మేలు. పిల్లల నుంచి మంచి వార్త వింటారు.

వృషభం
ఉద్యోగంలో మీ పరపతి పెరుగుతుంది. వ్యాపారస్తులకు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వస్తాయి. పాత స్నేహితులను కలిసి సరదాగా గడుపుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం
ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో ఇతరులను గుడ్డిగా నమ్మకండి. ఆదాయం బాగుంటుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబంతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.

కర్కాటకం
మీ మాటకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అప్పులు తీర్చే మార్గాలు వెతుకుతారు.

సింహం
మీ పనితీరుతో అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. చిక్కుల్లో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పిల్లల ఎదుగుదల మీకు సంతోషాన్ని ఇస్తుంది.

కన్య
ఉద్యోగంలో హోదా లేదా జీతం పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. అయితే, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండటం మంచిది.

తులా
ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం
పనుల్లో ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉంటుంది. స్నేహితులకు సాయం చేస్తారు. అనవసర ఖర్చులు నియంత్రించుకోవడం అవసరం. సమయస్ఫూర్తితో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు
వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఎవరికీ ఆర్థికంగా హామీలు ఇవ్వకపోవడం మంచిది.

మకరం
ఏ పని మొదలుపెట్టినా విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

కుంభం
ఆఫీసులో పై అధికారుల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. మీరు సాయం చేసిన వారు ఇప్పుడు ముఖం చాటేయవచ్చు, దీనివల్ల కొంత నిరాశ చెందుతారు. జీవిత భాగస్వామి సలహాలు పాటించడం మేలు.

మీనం
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్నేహితుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. అనుకోకుండా ఇష్టమైన బంధువులను కలుస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *