Hisaab Barabar: వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ప్రముఖ ఓటీటీ జీ5 నుంచి మరో ఆసక్తికరమైన సినిమా రానుంది. అదే ‘హిసాబ్ బరాబర్’. విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించగా నీల్ నితిన్, కీర్తి కుల్హారి ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు. జీ5లో జనవరి 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రీమియర్‌కు సిద్ధమైందీ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే.. ఓ బ్యాంక్ చేసే చిన్న పొరపాటు ఓ వ్యక్తి జీవితాన్ని తలక్రిందులు చేస్తే ..అతనెలా స్పందించాడు. న్యాయం కోసం అతను ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్థికపరమైన మోసం, అవినీతి, న్యాయం కోసం చేసే పోరాటం ఇవన్నీకథలో భాగంగా మిళితమై ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. విలక్షణ నటుడు ఆర్.మాధవన్, నీల్ నితిన్,కీర్తి కుల్హారి తదితరులు వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేక్షకులు మెచ్చేలా చక్కటి డ్రామా, కామెడీ, సామాజిక అంశాలతో.. అశ్విన్ ధీర్ దర్శకత్వంలో జియో స్టూడియోస్, ఎస్పి సినీకార్ప్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Hisaab Barabar: రైల్వే డిపార్ట్‌మెంట్‌లో చిరు ఉద్యోగి అయిన రాధే మోహన్ శర్మ పాత్రలో మాధవన్ మనకు ఇందులో కనిపిస్తారు. ఆయన ఓసారి తన బ్యాంక్ ఖాతాలో చిన్న తేడాని గుర్తించి బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తాడు. దాని గురించి ఆరా తీయగా అదొక పెద్ద ఆర్థికమైన మోసమని తెలుస్తుంది. దాని చుట్టు ఉన్న మోసం, అవినీతి వంటి వాటిని సదరు టికెట్ కలెక్టర్ గుర్తిస్తాడు. ఈ క్రమంలో తను ఆ బ్యాంక్ హెడ్ మిక్కీ మెహతా (నీల్ నితిన్) వంటి పెద్ద వ్యక్తితో పోరాటం చేయాల్సి వస్తుంది. ఊహించని మలుపులతో సాగే ఈ కథలో రాధే మోహన్ అనే సామాన్యుడు అవినీతితో వ్యవస్థీకృతమైన సమస్య నుంచి ఎలా ఎదుర్కొంటాడు.. దాన్నుంచి సురక్షితంగా ఎలా బయట పడతాడు? అనే విషయాలు అందరినీ ఆలోచింప చేస్తాయి.
ఇది కూడా చదవండి: B Jaya: భానుమతి, విజయనిర్మల తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు బి.జయ!
Hisaab Barabar: దర్శకుడు అశ్విన్ ధీర్ మాట్లాడుతూ ‘‘ సమాజంలోని అవినీతి, మోసాలను ఓ సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన‘హిసాబ్ బరాబర్’ అందరిలో ఆలోచింప చేసే చిత్రం. సామాజిక అంశాలతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన డ్రామా, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మాధవన్, నీల్ నితిన్, కీర్తి కుల్హారి వంటి వారు తమదైన నటనతో మెప్పిస్తారు. జనవరి 24న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’
Hisaab Barabar: ఆర్.మాధవన్ మాట్లాడుతూ ‘‘జీ5తో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇలాంటి ఓ సినిమాలో భాగం కావటం అనేది యాక్టర్‌గా నాకెంతో సంతోషంగా ఉంది. సామాన్యుడైన రాధే మోహన్ శర్మ పాత్రలో నటించటాన్ని ఎంజాయ్ చేశాను. ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. మనలో ఉండే కామన్ మ్యాన్ అవినీతికి వ్యతిరేకంగా ఎలా పోరాటం చేశాడనేదే కథ. అందరికీ మూవీ నచ్చుతుంది. ఇలాంటి వాస్తవ కథనాలతో సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను’’
Hisaab Barabar: నీల్ నితిన్ మాట్లాడుతూ ‘‘హిసాబ్ బరాబర్ చిత్రంలో మిక్కీ మెహతా అనే బ్యాంకర్ పాత్రతో మెప్పిస్తాను. యాక్టర్‌గా నాకు సవాలు విసిరిన పాత్ర ఇది. మాధవన్ వంటి యాక్టర్‌తో కలిసి నటించటం చాలా సంతోషం. తనొక అద్భుమైన నటుడు, వ్యక్తి. స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య పోటాపోటీగా ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. జనవరి 24 నుంచి జీ5లో ఈ సినిమా ప్రీమియర్ కానుంది’’
Hisaab Barabar: కీర్తి కుల్హారి మాట్లాడుతూ ‘‘హిసాబ్ బరాబర్ వంటి చిత్రంలో నటిగా సవాలు విసిరిన వైవిధ్యమైన పాత్రలో నటించటం ఎంతో సంతోషంగా ఉంది. మాధవన్‌తో నటించటం మంచి ఎక్స్‌పీరియె్స్. అశ్విన్ ధీర్ సినిమాను ఎంతో గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. అన్నీ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఎంటైర్‌టైనర్ ఇది. అందరినీ ఆలోచింప చేసే చిత్రం. జనవరి 24 నుంచి ప్రీమియర్ కానున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకంటున్నాను’’ .
ఇది కూడా చదవండి: Viral News: ఐటెం రాజాలు కావాలి…ఇదెక్కడి స్కామ్ రా మావా!
ZEE5 గురించి...
జీ5 భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఒకటి. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లను అందిస్తూ మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం.
12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.