Educational News,

Higher education: ప‌రీక్ష‌లు రాసే యువ‌తులకు ఉన్న‌త విద్యామండ‌లి గుడ్‌న్యూస్‌

Higher education: ప‌రీక్ష‌లు రాయాలంటే యువ‌తుల క‌ష్టాలు అంతా ఇంతా కాదు. ఓ యువ‌తి ప‌రీక్ష కేంద్రానికి వెళ్లాలంటే ఆమె వెంట ఎవ‌రో ఒక‌రు రావాల్సిందే. వాహ‌న ఇబ్బందులు స‌రేస‌రి. న‌డిచి వెళ్లాల‌న్నా భ‌యంతో కూడిన ఇబ్బందులు. ఒక‌వేళ పెళ్ల‌యినా, పిల్ల‌లు క‌లిగినా దూర‌భారం వెళ్లి రావాలంటే తీవ్ర అవ‌స్థ‌లు ప‌డాల్సిందే. ఈ ద‌శ‌లో కొంద‌రు యువ‌తులు కొన్ని ప‌రీక్ష‌ల‌ను వ‌దులుకుంటున్నార‌ని కొన్ని స‌ర్వేల్లో తేలింది. దీంతో ఎంద‌రో చ‌దువులు మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తున్నారు. ఇంకొంద‌రు ఉద్యోగ ప‌రీక్ష‌లు రాయ‌లేక‌పోతున్నారు.

Higher education: ఈ ద‌శ‌లో అలాంటి యువ‌తుల‌కు ఉన్న‌త విద్యామండ‌లి శుభ‌వార్త‌ను అందించింది. ఇక నుంచి ప‌రీక్ష‌లు రాసే యువ‌తుల కోసం ఓ స‌ద‌వ‌కాశాన్ని తీసుకొచ్చింది. ఏకంగా ఆ యువ‌తుల‌కు స‌మీపంలో ఉండే ప‌రీక్ష కేంద్రాల్లోనే ప‌రీక్ష‌లు రాసే అవ‌కాశాన్ని క‌ల్పించేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇటీవ‌ల క‌న్వీన‌ర్ల‌తో స‌మావేశ‌మైన ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ వీ బాల‌కృష్ణారెడ్డి ఈ విష‌యంపై చ‌ర్చించారు.

Higher education: రాష్ట్రంలో ప‌రీక్ష‌లు రాసే యువ‌తుల్లో సుమారు 50 శాతం మంది యువ‌తులే ఉంటున్నార‌ని, వారి భ‌ద్ర‌త‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని వారికి స‌మీపంలో ఉండే కేంద్రాల్లోనే ప‌రీక్ష‌లు రాసే అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ చైర్మ‌న్ వీ బాల‌కృష్ణారెడ్డి వెల్ల‌డించారు. విద్యార్థుల‌కు అన్ని స‌దుపాయాలు అందుబాటులో ఉండేలా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా క‌న్వీన‌ర్ల‌కు ఆదేశాలు జారీచేసిన‌ట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *