Telangana High Court

High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన ఆదేశాలు..

High Court: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం వాదనలు ముగియగా, నేడు హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.

హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మాధవి దేవి స్పష్టంగా పేర్కొన్నారు – “సెప్టెంబర్ 30లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి” అని. అలాగే 30 రోజుల్లో వార్డు విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వం – ఎన్నికల సంఘం వాదనలు ఇలా ఉన్నాయి

  • ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎన్నికల నిర్వహణకు 30 రోజులు గడువు కావాలన్నారు.

  • రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 60 రోజుల సమయం అవసరమని వాదించింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ముగ్గురు అరెస్ట్

ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు సెప్టెంబర్ 30 చివరి తేదీగా ఖరారు చేసింది. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో ముఖ్యాంశాలు:

  • స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడాన్ని పలు గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు.

  • హైకోర్టు ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా తుది తీర్పు ఇచ్చింది.

  • ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Seethakka: కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *