Hyderabad:వారికి ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారు?

Hyderabad:తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పలు ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ కేడర్‌లో కొనసాగించిన విషయంలో హైకోర్టు అసంతృప్తి తెలిపింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు ఇచ్చారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటిసులు జారీ చేసింది. డిసెంబర్ 10వ తేదీ లోపు ఈ నిర్ణయంపై పూర్తి వివరణ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.


వడ్ల శ్రీకాంత్ పిటిషన్

సెప్టెంబర్ 26న విడుదలైన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడాన్ని వడ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి హైకోర్టులో సవాలు చేశారు.
దీన్ని చట్టవిరుద్ధం అని పేర్కొంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

శ్రీకాంత్ తరఫున సీనియర్ న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టులో వాదనలు వినిపించారు.


హైకోర్టు స్పందన

వాదనలు విన్న న్యాయమూర్తి సూరేపల్లి నంద ధర్మాసనం,
ముగ్గురు అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు ఇచ్చారో స్పష్టీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *