Helicopter Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనను మరువకముందే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన చోటుచేసుకున్నది. కేదార్‌నాథ్ ఆలయానికి భక్తులతో వెళ్లి మరోచోటుకు ఆ హెలికాప్టర్ అడవుల్లో నుంచి ప్రయాణిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ సహా దానిలో ప్రయాణిస్తున్న భక్తులందరూ దుర్మరణం పాలయ్యారు.
Helicopter Crash: ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ లో పైలెట్ సహా ఏడుగురు భక్తులతో కలిసి కేదార్‌నాథ్ ధామ్ వెళ్లి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి గుప్త్ కాశికి ఆ హెలికాప్టర్‌లోనే బయలుదేరారు. గౌరీకుంద్, త్రిజుగి నారాయణ్ మధ్య అడవుల్లో ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ సహా ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు తెలిసింది.
Helicopter Crash: హెలికాప్టర్ మృతులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే సమచారం అందగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. వరుస హెలికాప్టర్ ప్రమాద ఘటనలపై సీరియస్ అయ్యారు. విచారణ జరపాలని ఆదేశించారు.