Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వానల వల్ల వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేని వానలతో జనజీవనం స్తంభించిపోయింది. రోజంతా ముసురుతో జనం అవస్థలు పడుతున్నారు.
Heavy Rain Alert: తాజాగా ఐఎండీ (భారత వాతావరణ విభాగం) తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. శని, ఆదివారాల్లో (ఆగస్టు 16, 17 తేదీలు) పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rain Alert: హైదరాబాద్‌తోపాటు నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అందుకే ఆ 9 జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొన్నది.
