Health Tips: మొలకలు.. హెల్దీ ఫుడ్. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ లోపాన్ని అధిగమించవచ్చు. గ్రీన్ మూంగ్‌ను ముంగ్ బీన్స్ అని కూడా అంటారు. మొలకలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్ పీస్ ప్రోటీన్ల నిలయం. ఇది ఒక అద్భుతమైన శాఖాహార ప్రోటీన్. శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చడమే కాకుండా ఎంజైమ్‌లు, హార్మోన్ల ఉత్పత్తికి చిక్‌పీస్ తీసుకోవడం చాలా ఉపయోగంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Health Tips: దొండ కాయలు తింటున్నారా?.. పోషకాలు ఫుల్
Health Tips: మొలకలను తీసుకోవడం వల్ల ముఖం, చర్మం మెరిసిపోతుంది. వీటిని తినడం వల్ల ముఖంపై ముడతలు, మచ్చలు, నల్లటి వలయాలు వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. అదేవిధంగా వృద్ధాప్య ప్రభావాన్ని సైతం తగ్గిస్తుంది.
మొలకలలో రాగి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును మరింత బలంగా చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో కాల్షియం, మెగ్నీషియంను మెరుగుపరుస్తుంది. మెదడుకు సరైన ఆక్సిజన్ అందడంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడంలో మొలకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుత ఆధునిక కాలంలో కొలెస్ట్రాల్ పెరగడమనేది అందరినీ వేధిస్తుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి ఆహారంలో మొలకలను చేర్చుకోవడం బెటర్. మొలకలు జీర్ణసమస్యలను తొలగిస్తాయి. పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. మొలకలు కళ్లకు కూడా మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి5 వంటి విటమిన్లు ఉంటాయి. రెటీనా ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి అవసరం.

