Health Tips

Health Tips: లవంగాలతో ఎన్ని లాభాలో తెలుసా? ఆయుర్వేదంలో వీటి ప్రత్యేకతే వేరు..

Health Tips: మసాలా దినుసుల్లో ఒకటైన లవంగం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. లవంగాలలో చాలా పోషకాలుంటాయి. పంటి నొప్పితో సహా అనేక చిన్న ఆరోగ్య సమస్యలకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే నేటికీ ఆయుర్వేదంలో లవంగాలను ఉపయోగిస్తున్నారు. లవంగం ఎలాంటి సమస్యలను నయం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

Health Tips: భోజనం చేసిన తర్వాత జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి లవంగాలు మేలు చేస్తాయి. భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను తింటే జీర్ణ ఎంజైమ్‌ల స్రవాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలు దూరమవుతాయి.

ఇది కూడా చదవండి: Allu Arjun Arrest LIVE Updates: అల్లు అర్జున్ అరెస్ట్ లైవ్ అప్డేట్స్

నోటి ఆరోగ్యం..

Health Tips: రోజూ మనం తినే ఆహారం నోటీకి అంటుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. అయితే ప్రతిరోజూ రాత్రి భోజనం తర్వాత లవంగాలను నమలడం వల్ల దానిలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతాయి.

షుగర్ కంట్రోల్..

Health Tips: మధుమేహ వ్యాధిగ్రస్తులకు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం సర్వసాధారణం. కానీ భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

వికారం నుండి రిలీఫ్

Health Tips: కొందరికి తిన్న తర్వాత వికారం వస్తుంది. లవంగాలను నమలడం వల్ల వికారం తగ్గుతుంది. లవంగ సారం లాలాజలంతో కలిసినప్పుడు వికారంతో సంబంధం ఉన్న లక్షణాలు తగ్గుతాయి.

బరువు నియంత్రణ

Health Tips: బరువు తగ్గాలనుకునే వారికి లవంగాలు ఉపయోగపడతాయి. లవంగాలలో ఉండే విటమిన్లు, మినరల్స్ జీవక్రియను పెంచుతాయి. దీంతో శరీరంలోని కొవ్వు కరుగుతుంది. 

లవంగం టీ

Health Tips: లవంగాలు స్పైసీగా ఉండటం వల్ల తినడం కష్టం. కాబట్టి మీరు లవంగం టీ తయారు చేసి తాగొచ్చు. కొన్ని లవంగాలను వేడి నీటిలో 5-10 నిమిషాలు ఉడకబెట్టి.. టీ చేసుకొని తాగాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *