HCU: ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేసిన హైటెక్ మాస్ కాపీయింగ్..

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో నిర్వహించిన పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వెలుగుచూసింది. అయితే ఇది సాధారణ కాపీయింగ్ కాదు… ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చేసిన హైటెక్ మోసం కావడం గమనార్హం.

పరీక్ష రాస్తున్న ఇద్దరు యువకులు చాలా ప్లాన్‌గా వ్యవహరించారు.
వారు తమ షర్ట్ బటన్‌లో మైక్రో స్కానర్లు అమర్చుకుని, ప్రశ్నాపత్రాన్ని స్కాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ స్కాన్ అయిన ప్రశ్నలు బయట ఉన్న వ్యక్తులకు పంపించి, అక్కడి నుంచి ఏఐ సహాయంతో సమాధానాలు పొందారు.

ఆ సమాధానాలను వారు బ్లూటూత్ ఇయర్ డివైస్ ద్వారా వినిపించుకుని పరీక్ష రాసినట్లు పోలీసులు గుర్తించారు. బయటికి ఏమాత్రం అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ, ఇన్విజిలేటర్‌కు వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. తక్షణమే ఇన్విజిలేటర్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి వద్ద నుంచి మైక్రో స్కానర్ల బ్లూటూత్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యా వ్యవస్థలో టెక్నాలజీని దుర్వినియోగం చేయడంపై ఇది గట్టి హెచ్చరికగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షల నిర్వహణలో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *