Havish: టాలీవుడ్ యంగ్ హీరో హవిష్, హిట్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబోలో రూపొందుతున్న సినిమా సందడి మొదలైంది. ‘ధమాకా’, ‘మజాకా’ వంటి బ్లాక్బస్టర్లతో ఆకట్టుకున్న త్రినాథరావు, ఈసారి హవిష్తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘నేను రెడీ’ టైటిల్ ఫిక్స్ చేసి, ఇటీవల టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. హవిష్ బర్త్డే సందర్భంగా రిలీజైన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మిక్కీ జే.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కావ్య తాపర్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. త్వరలో రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ సినిమా, కామెడీతో పాటు హవిష్లోని కొత్త కోణాన్ని చూపించనుందని టాక్. ఈ సినిమాతో హవిష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
View this post on Instagram
