Harish Rao: రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండగా, మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దవుతున్నది. ఈ దశలో హరీశ్ రావు వ్యాఖ్యలపై అంతటా ఆసక్తి నెలకొన్నది.
Harish Rao: రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదని హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తూ ఇప్పటికే ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇది సహజ మరణాలు కాదని, ప్రభుత్వ హత్యలేనని సంచలన ఆరోపణలు చేశారు.
Harish Rao: పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు రూ.3 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని హరీశ్‌రావు ఆరోపించారు. కేవలం 20 శాతం పత్తి రైతులకు మాత్రమే మద్దతు ధర వచ్చిందని తెలిపారు. 80 శాతం పత్తిని బ్రోకర్లు రైతులు దగ్గర తక్కువ ధరకు కొని సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిపారు. సీసీఐ అధికారుల పట్ల వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.