Harish Rao: హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వస్తున్న ఆయన రాకపై హరీశ్‌రావు స్పందించారు. పనిలో పనిగా సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. తీవ్ర అస్వస్థతకు గురై కింగ్ కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Harish Rao: రైతులు, ఆటో డ్రైవర్లు, పాఠశాలల్లో పిల్లలు చనిపోతే రాహుల్‌గాంధీ రాలేదు కానీ, రేవంత్‌రెడ్డి ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 116 మంది విద్యార్థులు చనిపోయారని విమర్శించారు. ఇంత మంది విద్యార్థులు చనిపోయినా రేవంత్‌రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా అవ్వడం లేదని మండిపడ్డారు.
Harish Rao: ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్‌బాల్ ఆడటానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. బాగ్‌లింగంపల్లి గురుకుల విద్యార్థులు 90 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై, ముఖ్యమంత్రికి, మంత్రులకు చీమకుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదని మండిపడ్డారు.
Harish Rao: అందరూ ఫుట్‌బాల్ ఆడటంలో బిజీగా ఉన్నారని హరీశ్‌రావు విమర్శించారు. రూ.100 కోట్లతో ఫుట్‌బాల్ ఆడేకంటే పిల్లలకు ఏదైనా మంచి హాస్టల్ కట్టి, కడుపు నిండా మంచి ఆహారం పెట్టొచ్చు కదా.. అని సూచించారు. రేవంత్‌రెడ్డి విజన్ 2047 అంటున్నాడు..కానీ ఇది పాయిజన్ 2047 అని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజూ ఒక మూలలో కలుషిత ఆహారంతో పిల్లలు మంచాలపై పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అస్వస్థతకు గురైన పిల్లలు మళ్లీ తిరిగి హాస్టళ్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారని తెలిపారు.
