Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హెచ్చరిక జారీ చేశారు. వెంటనే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం మోటర్లను ఆన్ చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను నింపాలని కోరారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Harish Rao: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీఆర్ఎస్‌పైన కోపంతో సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 73,600 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని తెలిపారు. గోదావరి నది 96 మీటర్ల ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్నదని తెలిపారు.
Harish Rao: కన్నెపల్లి పంపుహౌస్ వద్ద కావాల్సిన దానికంటే ఎక్కువ ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నదని, మోటర్లు ఆన్‌చేస్తే చాలు, రైతులకు నీటి సరఫరా జరుగుతుందని హరీశ్‌రావు తెలిపారు. కానీ, నీళ్లు ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బందులుకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యమని విమర్శించారు.
Harish Rao: వెంటనే కాళేశ్వరం మోటర్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే అదును కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి నీటిని సరఫరా చేయాలని కోరారు. ఆలస్యం చేస్తే అదును దాటి రైతులు అవస్థలు పడతారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే తాము ఊరుకునేది లేదని, లక్ష మంది రైతులతో కన్నెపల్లి పంపుహౌస్‌కు వెళ్లి మోటర్లను ఆన్ చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.
Harish Rao: పోలవరం డయాఫ్రం వాల్, గైడ్‌వాల్ కొట్టుకుపోయి రూ.2,000 కోట్ల నష్టమైతే ఎన్‌డీఎస్ఏ అక్కడికి వెళ్లదు కానీ, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోయి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడితే అక్కడికీ వెళ్లదు కానీ, మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎన్‌డీఎస్ఏను వెంటనే పంపించిండు అని హరీశ్‌రావు ఆరోపించారు.
Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి చిల్లర రాజీకాయలు చేస్తున్నారని ఆరోపించారు. వారిద్దరూ కలిసిపోయారనడానికి ఇదే నిదర్శనమని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఢిల్లీలో కొట్లాడుతరు, గల్లీల్లో అలయ్ బలయ్ చేసుకుంటరని ఆరోపించారు.