Harish Rao: అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే ఇంకోలా.. సీఎం రేవంత్ పై హరీష్ రావు విమర్శలు..

Harish Rao: తాను పోలీసు కుటుంబం నుంచి వచ్చానని, పోలీసుల కష్టాలు తనకు తెలుసన్న సీఎం ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు.ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించడం హేయమైన చర్య అని విమర్శించారు.

అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా అని ప్రశ్నించారు. పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని, వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని నిలదీశారు.నేను పోలీసు కుటుంబం నుండి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెల్సు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు.. అంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి గారు.. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు.? అని ప్రశ్నించారు.

వారి ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. అధికారం లేకుంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా..? భేషజాలు పక్కన పెట్టి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, 10 మందిని ఉద్యోగం నుండి తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని, సస్పెండ్ చేసిన 39 మంది కానిస్టేబుళ్లను కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *