Harish Rao:

Harish Rao: భ‌ట్టీ ఇవిగో ఆధారాలు.. సింగ‌రేణిపై హ‌రీశ్‌రావు కీల‌క ఆరోప‌ణ‌లు

Harish Rao: సింగ‌రేణి కుంభ‌కోణంపై నిన్న డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క చెప్పిన వివ‌రాల‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. భ‌ట్టి విక్ర‌మార్క మీడియా స‌మావేశం చూస్తే ఉల్టా చోర్ కొత్వాల్ డాంటే అనే సామెత గుర్తుకు వ‌స్తుంద‌ని ఎద్దేవా చేఠ‌శారు. సీఎం రేవంత్‌రెడ్డే దొంగ, ఆయ‌న బావ మ‌రిది మొద‌టి ల‌బ్ధిదారుడు అని తాము చెప్తుంటే భ‌ట్టి మ‌రోలా మాట్లాడుతాడు ఏమిట‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు లేఖ రాయండి.. తాను సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతాన‌ని నిన్న భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడటంపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తంచేశారు.

Harish Rao: ఈ రోజు (జ‌న‌వ‌రి 25) హైద‌రాబాద్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ప‌లు కీల‌కాంశాల‌ను వెల్ల‌డించారు. ప‌లువురు కాంట్రాక్ట‌ర్లు సింగ‌రేణి జీఎం ఆఫీస్ ముందు పొటోలు తీసుకొని.. తాము సైట్ విజిట్ చేశాము.. త‌మ టెండ‌ర్‌ను క‌న్సిడ‌ర్ చేయండి.. అని మెసేజ్‌లు పెట్టారు, మెయిల్స్ పంపార‌ని తెలిపారు. ఇంకా అనేక కంపెనీలు కూడా సైట్ విజిట్ చేసినా, త‌మ‌కు సర్టిఫికెట్ ఇవ్వ‌లేద‌ని చెప్తున్నాయ‌ని తెలిపారు. వారు పంపిన మెసేజ్‌లు, మెయిల్స్ మీరు బ‌య‌ట పెడ‌తారా? లేదా త‌మ‌ను బ‌య‌ట‌పెట్టమంటారా? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

Harish Rao: 2025 జ‌న‌వ‌రిలో భూపాల‌ప‌ల్లిలో ఒక ఓబీ కాంట్రాక్ట్ టెండ‌ర్ సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ లేకుండా పిలిచార‌ని హ‌రీశ్‌రావు గుర్తుచేశారు. అంటే పాత బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలోని విధానాన్నే సైట్ విజిట్ నిబంధ‌న లేకుండా కొన‌సాగించార‌ని తెలిపారు. అయితే మూడు నెల‌ల త‌ర్వాత అదే 2-25 మేలో వీఆర్ ఓసీ టెండ‌ర్ సైట్ విజిట్ స‌ర్టిఫికెట్‌తో పిలిచార‌ని ఆరోపించారు. దానికి ల‌బ్ధిదారుడు రేవంత్‌రెడ్డి బావ‌మ‌రిది సృజ‌న్‌రెడ్డి అని, ఆయ‌న కంపెనీ శోధా క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌ కంపెనీ ఆరోపించారు. దీని త‌ర్వాత అన్ని టెండ‌ర్ల‌కు సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ నిబంధ‌న పెట్టి అన్నింటినీ రింగ్ చేశార‌ని విమ‌ర్శించారు.

Harish Rao: 2018లోనే సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ ప్ర‌తిపాద‌న ఉన్న‌ద‌ని భ‌ట్టి చెప్పార‌ని, అందులో ఆ నిబంధ‌న‌ను ఏ ప‌నుల కోసం పెట్టాల‌ని సిఫార‌సు చేశారో చెప్ప‌లేద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కోస‌మా, కోల్ ఎవాక్యుయేష‌న్ సిస్టం కోస‌మా, స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ కోస‌మా, ఓవ‌ర్ బ‌ర్డెన్ రిమూవ‌ల్ కోస‌మా అనేది బ‌య‌ట పెట్ట‌లేద‌ని తెలిపారు. ఆయ‌న చ‌దివిన డాక్యుమెంట్‌లో ఒక లైన్ చ‌దివి, మ‌రో లైన్ చ‌ద‌వ‌కుండా వ‌దిలేశార‌ని ఆరోపించారు.

Harish Rao: ఒక‌టి కాదు రెండు కాదు.. ప‌దుల సంఖ్య‌లో సింగ‌రేణిలో కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని హ‌రీశ్‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను రెండింటినే బ‌య‌ట‌పెట్టాన‌ని, ఇంకా బ‌య‌ట పెట్టాల్సిన‌వి చాలా ఉన్నాయ‌ని తెలిపారు. వీళ్లు ఏహోట‌ళ్లో మీటింగ్ పెట్టారో త‌న వ‌ద్ద ఫొటోలు కూడా ఉన్నాయ‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వాటిని విడుద‌ల చేస్తాన‌ని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *