Harish Rao

Harish Rao: 15 రోజుల పాటు నిర్వహించాలని పట్టు పట్టాం

Harish Rao: అసెంబ్లీలో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసిందని బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సభను 15 రోజుల పాటు నిర్వహించాలని తమ పార్టీ పట్టు పట్టినట్లు వెల్లడించారు.

అయితే ప్రభుత్వం వారం రోజుల పాటు మాత్రమే సభ నిర్వహిస్తామని చెప్పిందని హరీష్‌ రావు అన్నారు. అనంతరం మరోసారి BAC సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపినట్లు చెప్పారు.

అదేవిధంగా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అనుమతి ఇవ్వాలని తాము కోరామని, ఆ అంశంపై కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని హరీష్‌ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *