Harish Rao: రేవంత్‌రెడ్డికి పరిపాలనా దక్షత లేదు

Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై భాజపా, బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో ఆక్షేపణలు వ్యక్తం చేశారు.

తెలంగాణకు రేవంత్ గ్రహణంలా పట్టారు

హరీష్‌రావు మాట్లాడుతూ, “రేవంత్‌రెడ్డి పాలన తెలంగాణపై గ్రహణంలా పడింది. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. ప్రాజెక్టులు నిలిచిపోయాయి. రేవంత్‌రెడ్డికి పరిపాలనా దక్షత లేదని ఇప్పటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి” అని ఆరోపించారు.

20:20 కమీషన్ పాలనే!

రేవంత్‌రెడ్డి పాలన కేవలం 20:20 కమీషన్ పాలనగా మారిందని హరీష్‌రావు విమర్శించారు. “ప్రతి వ్యవహారంలోనూ కమిషన్లు, లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు కష్టపడే ఉద్దేశం కాంగ్రెసుకు లేదు” అని విమర్శించారు.

ప్రతిపక్షాలపై నిందలు వేయడం తప్ప మరేమీ చేయడం లేదు

రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన ప్రభుత్వానికి అది చేతకాక, ప్రతిపక్షాలపై నిందలు వేయడం ఒక్కటే తెలిసిందని హరీష్‌రావు అన్నారు. “స్వయంగా పాలించలేక ప్రతిపక్షాలను తప్పుబట్టడం ఎలా?” అని ప్రశ్నించారు.

ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు

తెలంగాణలో నెలకొన్న కరువుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని హరీష్‌రావు ఆరోపించారు. “కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో ఎక్కడా నీటి కొరత రాలేదు. ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాక, నీరు సముద్రం పాలు చేసింది” అని ఆయన విమర్శించారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణ వద్ధి పథంలో

కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి సాధించిందని, ఎప్పుడూ కరువు సమస్యలు ఎదురుకాలేదని హరీష్‌రావు స్పష్టం చేశారు. “కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు రైతులు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు” అని అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kalvakuntla Kavitha: భారీ అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎదుట ఎమ్మెల్సీ క‌విత బైఠాయింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *