Hari Hari Veeramallu: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై అభిమానులే కాదు.. సినీజనం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నది. వాస్తవంగా ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికానందున రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు.
Hari Hari Veeramallu: ఇక్కడే సరికొత్త అప్‌డేట్ బయటకొచ్చింది. వీఎఫ్ఎక్స్ లో 6,000 షాట్స్ ఉన్నాయని తెలిసింది. అలాగే ప్రతి షాట్‌లో 10 లేయర్లు ఉన్నాయని గుసగుసలు. అయితే క్లైమాక్స్ భాగం వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు చేసినట్టు వినికిడి. దీనికోసమే నిర్మాతలు ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు చేశారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. సినిమా నిర్మాణంలో దర్శకుల సూచన మేరకు నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, భారీగా ఖర్చు చేశారని తెలుస్తున్నది.
Hari Hari Veeramallu: హరిహర వీరమల్లు సినిమా భారీ బడ్జెత్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ కథకు అనుగుణంగా ఎక్కువగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నది. ఇరాన్‌తోపాటు ఇతర దేశాల్లో సాంకేతిక పనులు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ నెలాఖరులో లేదా జూలైలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నదని చిత్రవర్గాల సమాచారం.

