Hardik Pandya Girlfriend: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభంలో భారత బౌలింగ్ అంత ప్రభావవంతంగా లేకపోయినప్పటికీ, తర్వాత కట్టుదిట్టమైన లైన్స్ వేశారు. హార్దిక్ పాండ్యా 9వ ఓవర్‌ను వేస్తున్న సమయంలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం వికెట్ కోల్పోవడం ద్వారా టీమ్ ఇండియాకు తొలి బ్రేక్ ఇచ్చాడు. అయితే బాబర్ ఆజం ఔట్ అయిన వెంటనే టీవీ తెరపై ఒక ముఖం అకస్మాత్తుగా కనిపించింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ విషయానికి వస్తే…
హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను మరో అమ్మాయితో డేటింగ్ మొదలుపెట్టాడని వార్తలు వచ్చాయి. తర్వాత విదేశీ పర్యటనల సమయంలో జాస్మిన్ వాలియా ఫోటోలను సోషల్ మీడియాలో హార్దిక్ షేర్ చేయడంతో, వారి సంబంధం గురించి నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇక ఒక్కసారిగా హార్దిక్ పాండ్యా వికెట్ తీసిన తర్వాత టీవీలో స్టాండ్స్ లో కనపడిన ఆమె ఎవరో ఆమె ఎవరూ అంటే… హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ అని అందరూ అనుకుంటున్న జాస్మిన్ వాలియా అని తెలిసింది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌ను చూడడానికి జాస్మిన్ వాలియా దుబాయ్‌లోని స్టేడియంకు వచ్చింది.
ఇక తాజాగా జాస్మిన్ వాలియాతో హార్దిక్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నాడని తెలిసింది. బ్రిటీష్ సింగర్ మరియు టీవీ స్టార్ గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందిన జాస్మిన్ వాలియా, ఇంగ్లీష్ తో పాటు పంజాబీ మరియు హిందీ భాషల్లో మ్యూజిక్ ఆల్బమ్‌లను విడుదల చేసింది. జాస్మిన్ వాలియా ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌లో భారత సంతతికి చెందిన దంపతులకు జన్మించింది. జాస్మిన్ ‘ది ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్’ అనే బ్రిటీష్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయింది.
ఇక భారత క్రికెట్లలో తాజాగా విడాకులు అయిన వారిలో మహమ్మద్ షమీ, శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్ మరియు హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఈ మధ్యనే ధావన్ తన విడాకులు మరియు కొడుకు విషయంపై ఎమోషనల్ విషయాలు పంచుకోగా హార్దిక్ పాండ్యా కూడా టి20 ప్రపంచ కప్ సమయంలో మనస్థాపానికి గురైనట్లు కనిపించాడు. మరి హార్దిక ప్రస్తుతం ఈమెతో కలిసి ఉంటే… ఆ విషయం పెళ్లి వరకు దారితీస్తుందా లేదా అనేది చూడాలి.
As I said @jasminwalia supporting India for #hardik #INDvsPAK https://t.co/aMnPfn7n3C pic.twitter.com/Oo5Gcx6O2I
— Instinct (@Clutchxgod33) February 23, 2025